![]() |
![]() |
.webp)
కార్తీకదీపం ఐపోయినా ఆ జ్ఞాపకాల నుంచి కానీ ఆ సీరియల్ అనుభూతుల నుంచి తెలుగు ఆడియన్స్ ఎవరూ ఇంకా బయట పడలేదు. ఈ సీరియల్ లోని పాత్రలు పాత్రధారులు బుల్లి తెర మీద ఎక్కడ కనిపించినా సరే కార్తీక దీపం సీరియల్ నే గుర్తు చేసుకుంటున్నారు.
ఇక ఈ సీరియల్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన వంటలక్క అంటే చాల ఆమెను దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలా చూస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. ఐతే వంటలక్క సీరియల్ కార్తీక దీపం ఐపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అలాగే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ కూడా సోషల్ మీడియాలో తన క్రియేటివిటీని కొత్తకొత్తగా ఫాన్స్ కి పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది ఈ దేవత..ఇక నెటిజన్స్ కూడా ఓ రేంజ్ లో వంటలక్కను అభినందించేస్తున్నారు. ఇంతకు ఆమె చేసిందంటే మహానటి సావిత్రి మూవీలోని సాంగ్ "నీ కోసమే నీ జీవించునది" అనే పాటకు బ్లాక్ అండ్ వైట్ వీడియో చేసి అందులో తన ఎక్స్ప్రెషన్స్ పలికించింది..ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. "మహానటి సావిత్రిగారు చేసిన ఏ క్యారెక్టర్ అయినా న్యాయం జరగాలంటే ..నేటి మహానటి ప్రేమివిశ్వనాథ్ గారికె సాధ్యం...సూపర్ అక్క మళ్ళీ మాటీవీకి ఎప్పుడు వస్తారు..డాక్టర్ బాబు ఎం చేసావ్ మళ్ళీ ఏడుస్తోంది...మీ నటన తెలుగు ఫాన్స్ అందరికీ ఎంతో ఇష్టం .. మహానటి సావిత్రి, సౌందర్యలా నటించారు. వాళ్ళ తర్వాత మీరే..వావ్ సో ఎక్స్ప్రెసివ్" అంటూ నెటిజన్స్ అంతా మెచ్చుకోలు కామెంట్స్ తో ముంచెత్తారు.
![]() |
![]() |